Site icon NTV Telugu

Rain In Hyderabad: హైదరాబాద్లో భారీ వర్షం.. ఈ రూట్లలో వెళ్లారో అంతే సంగతి

Rains Hyd

Rains Hyd

Rain In Hyderabad: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక, హైదరాబాద్ నగరంలో సాయంత్రం 7.30 గంటలకి వాన ప్రారంభమైంది. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

Read Also: Kyoro Electric Auto: బడ్జెట్ ధరలో క్యోరో ఎలక్ట్రిక్ ఆటో విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 200KM రేంజ్

ఇక, హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, టోలిచౌకి, ఫిలింనగర్, మణికొండ, గచ్చిబౌలి, మియాపూర్, లింగంపల్లి, పటాన్ చెరు, ఆర్సీపూరం, బీరంగూడ, సికింద్రాబాద్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, ఆరాంఘర్‌, పంజాగుట్ట, చిలకలగూడ, కుత్బుల్లాపూర్, షాపూర్, సూరారం, దుండిగల్, కొండాపూర్, పాట్నీతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. అయితే, వర్షం నీరు రోడ్డుపై చేరడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ అయింది. ఐటీ సెక్టార్ ఏరియాలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Exit mobile version