NTV Telugu Site icon

Red Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్..

Telangana Rains

Telangana Rains

Red Alert: అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం వరకు ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని దీంతో రాష్ట్రానికి రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తెలంగాణలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. జన జీవనంత అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. బయటికి రావద్దని ఇంట్లోనే ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.

Read also: Astrology: సెప్టెంబర్ 01, ఆదివారం దినఫలాలు

ఈ క్రమంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట, జోగులాంబ గద్వాల, జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం. ఇకపోతే.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఆరోగ్య శాఖల అధికారులు గైర్హాజరు కాకుండా చూడాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Off The Record : ఆ ఎమ్మెల్యే సొంత హామీలు..గెలిచి 9 నెలలు గడిచినా..!