Telangana Heatwave Alert: వామ్మో ఇవేం ఎండలు రా బాబోయ్.. తెలంగాణలో భానుడి ప్రతాపం
- తెలంగాణలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు..
- సాధారణం కంటే 4,5 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదు..
- ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం తీవ్ర ఇబ్బందులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Heatwave Alert: మార్చి నెల ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, తెలంగాణలో ప్రతి రోజూ 35 డిగ్రీల సెల్సియస్‌పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. హైదరాబాద్ నగరంతో పాటు ఖమ్మం, భద్రాది కొత్తగూడెం, జనగామ, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతుంది. ఈ ఎండల తీవ్రతకి ప్రజలు బయటకు రావాలంటే భయ పడుతున్నారు. దీంతో ఒంటిగంట సమయంలో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనపడుతున్నాయి.
Read Also: Nara Lokesh-Nimmala: రెస్ట్ తీసుకుంటారా?.. సభ నుంచి సస్పెండ్ చేయించాలా?
Also Read
- Hyderabad Ropeway: హైదరాబాద్‌లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌గా రోప్‌వేలకు భారీ ప్రణాళిక.!
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
- CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
- Hyderabad: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. గ్రామాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు గ్రీన్‌సిగ్నల్
అయితే, గ్రేటర్ హైదరాబాద్ లో ఎండల తీవ్రత పెరిగింది. సాధారణం కంటే 4, 5 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుంది. వడగాడ్పులు కూడా తీవ్రంగా వీయనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఏప్రిల్, మే నెలలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఎండ తాపంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో కూలర్లు, ఏసీలకు గిరాకీ పెరగ్గా.. మరి కొందరు మాత్రం పాత వాటికి రిపేర్లు చేయించుకుంటున్నారు. కాగా, వారం రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలు, రోజు వారి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.
తాజావార్తలు
-
Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
-
Jofra Archer: వైభవ్ సూర్యవంశీ విధ్వంసంను ఎలా ఆపాలి.. ఆర్ఆర్ పేసర్ ఆర్చర్ ఏం చెప్పాడంటే?
-
BJP Presidents: నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ.!
-
Siddaramaiah Resignation: ముగిసిన సిద్ధరామయ్య శకం.. భారతీయ లోక్ దళ్ నుంచి కాంగ్రెస్ దాకా.. 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఇదే..
-
RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..