MLC Kavitha: కవిత పిటిషన్ పై విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..
- ట్రయల్ కోర్టులో కవిత సీబీఐ కేసు విచారణ వాయిదా..
- ఛార్జ్ షీట్ ను తప్పుపడుతున్న కవిత తరపు న్యాయవాది..
- గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని జడ్జి కావేరి బవెజా సీబీఐని ఆదేశం..
- కవిత పిటిషన్ ను శుక్రవారం వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: కవిత దాఖలు చేసిన పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారాని (జులై 12వ తేదీ)న వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై శుక్రవారం విచారణ జరపనుంది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని జడ్జి కావేరి బవెజా ఆదేశించారు. నేడు ట్రయల్ కోర్టులో కవిత సీబీఐ కేసు విచారణ జరిగింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై వేసిన ఛార్జ్ షీట్ ను కవిత తరపు న్యాయవాది తప్పుపట్టారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు.
Read also: Bandi Sanjay: పోలీసులను పట్టించుకోరా… సీఎం రేవంత్ కు బండి సంజయ్ లేఖ..
Also Read
వాదనలు విన్న జడ్జి కావేరి బవెజా శుక్రవారాని పిటిషన్ ను వాయిదా వేశారు. కాగా, మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్టు చేశారు. తీహార్ జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే మద్యం కేసులో కవిత పాత్ర ఉందంటూ సీబీఐ పలు ఆధారాలతో ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కవిత ప్రమేయంపై నేడు విచారణ జరగనుంది. కాగా, ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ కోరుతుండగా.. బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తోంది.మధ్యంతర బెయిల్ కోసం కవిత తరఫు లాయర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాత్కాలిక బెయిల్ కోసం కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
MLC Kavitha: నేడు కవిత కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ..
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!