Disqualification MLAs: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, భద్రాచలం ఎమ్మెల్యేల పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. బీఆర్‌ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌గౌడ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్‌గౌడ్‌లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
Read also: Demolition: మేడ్చల్ లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్..
మూడు నెలల్లో అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు. హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. కాగా.. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై జూలై 3న హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు దాన నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావుపై అనర్హత వేటు వేసి కాంగ్రెస్‌లో చేరాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌గౌడ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వేర్వేరుగా కొద్దిరోజుల క్రితం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Gold Rate Today: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. 10 రోజుల్లో ఇదే మొదటిసారి!