Harish Rao: కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో అబద్ధాలు పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని మాట తప్పారుని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తన అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్ర లో కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీ లు ఇచ్చి అమలు చేయకుండా తెలంగాణ లో మోసం చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రుణమాఫీ చేస్తాం అని చెప్పి మాట తప్పినం అని మహారాష్ట్ర లో చెప్పాల్సి ఉండే అన్నారు. మహారాష్ట్ర కు వెళ్లి అన్ని గ్లోబల్స్ ప్రచారం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్ లో అబద్ధాలు పెట్టారని మండిపడ్డారు. మహాలక్ష్మి, రైతు భరోసా, రైతు కూలీలకు డబ్బులు, వరిపంట కు బోనస్, అమలు చేయట్లేదు అని చెప్పాల్సి ఉండే అన్నారు. తెలంగాణ లో అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. మేము మహారాష్ట్ర లో పోటీ చేయట్లేదన్నారు. అక్కడికి వెళ్లి ప్రచారం చేయమన్నారు. అందుకే ఇక్కడి నుండే కాంగ్రెస్ మోసాలపై చెబుతున్నామని క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ డబ్బులు వాడుతున్నారని ఆరోపించారు.
Read also: Jagtial Road Accident: కుటుంబంలో విషాదం నింపిన రిసెప్షన్.. వధువు అన్న మృతి..
నిన్న జరిగిన మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ రైతు గర్జన కార్యక్రమం హరీష్ రావు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ళ కోసం రైతు దీక్ష చేస్తున్నాం.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకే రైతు దీక్ష చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో చెప్పని ఎన్నో పథకాలు రైతుల కోసం కేసీఆర్ పెట్టారు.. రైతుల సీఎం కేసీఆర్ అని ఇతర రాష్ట్రాల్లోనూ అన్నారని హరీష్ రావు తెలిపారు. భూతుల సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచారు.. ఆరు గ్యారెంటీలు అమలు చేసిన అని మహారాష్ట్రలో రేవంత్ చెపుతున్నారు.. అందరిని మోసం చేసి మహారాష్ట్రలో అబద్దాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
Bike Racing: అర్ధరాత్రి రెచ్చిపోతున్న యువకులు.. రాయదుర్గం టీహబ్ వద్ద బైక్ రేస్..