NTV Telugu Site icon

Harish Rao: స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెడతాం..

Harish Rao

Harish Rao

Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి స్పీకర్ ను అవమానించలేదన్నారు. సభ మీ ఒక్కరిదీ కాదు – సభ అందరి అన్నారు.. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదు అన్నారు. మీ ఒక్కరిదీ అనే పదం అన్ పార్లమెంట్ పదం కాదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలియదు.. సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు.. కాంగ్రెస్ డిస్పెన్స్ లో పడింది.. స్పీకర్ ను కలిశాం.. రికార్డు తీయాలని అడిగాం.. దళిత స్పీకర్ నుఅగౌరపరిచే విధంగా జగదీష్ రెడ్డి మాట్లాడలేదు అని హరీష్ రావు వెల్లడించారు.

Read Also: Champion : మొత్తానికి నాలుగేళ్ల తర్వాత దర్శనం ఇచ్చిన స్టార్ కిడ్..

ఇక, జగదీష్ రెడ్డి మాట్లాడిన సభ వీడియో రికార్డు స్పీకర్ ప్రసాద్ కుమార్ ను అడిగాం అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. 15 నిమిషాల అయినా వీడియో రికార్డు స్పీకర్ తెప్పించలేదు.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాడకుండా బ్లాక్ చేశారు.. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయకపోతే అవిశ్వాసం పెడతాం అని పేర్కొన్నారు.