Gutha Sukender Reddy: మూసీ పై కేటీఆర్ చేసిన ట్విట్ కు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మనం చేస్తే సుందరీకరణ.. అవతలి వారు చేస్తే వేరేదా? అని ప్రశ్నించారు. మాజీ పట్టణాభివృద్ధి మంత్రి తెలివిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మూసీ ప్రక్షాళన పై బీఆర్ఎస్, బీజేపీ తీరును గుత్తా సుఖేందర్ రెడ్డి ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ స్వాగతిస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయని మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం నందనవనంలో గతం లోనే వేయికి పైగా ఇళ్లు నిర్మించి ఇచ్చారన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏదో చేస్తున్నట్టు వ్యతిరేక ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో రైతులు వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారన్నారు. మాజీ పట్టణాభివృద్ధి మంత్రి తెలివి గా మాట్లాడుతున్నారని తెలిపారు. ఆయన వైఖరి చూస్తే ఆశ్చర్యం వేస్తుందన్నారు.
ఆయన హయాంలో ఇష్టం వచ్చినట్టు గా భారీ అంతస్తులకు అనుమతులు ఇచ్చారన్నారు.
Read also: Take Care Eyes: కంప్యూటర్, మొబైల్స్ వాడేవారు కళ్లు జాగ్రత్త.. లేదంటే..
డ్రైనేజ్, నాలాల వ్యవస్థలు గాలికి వదిలి వేశారని తెలిపారు. మనం చేస్తే సుందరీకరణ.. అవతలి వారు చేస్తే వేరేదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక బోర్డు పెట్టి చైర్మెన్ ను కూడా పెట్టింది మీరే కదా? అని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. వాజ్ పాయ్ హయాంలో నదుల ప్రక్షాళన ఈటెల రాజేందర్ కు తెలియదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ప్రతిపక్షాల తీరును ఎండగట్టాలన్నారు. అవసరం అయితే మూసీ ప్రక్షాళన కోసం ఉద్యమానికి దిగాలని తెలిపారు. ప్రత్యామ్నాయం చూపకుండా మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఖాళీ చేస్తే ప్రశ్నించాలన్నారు. కానీ అందరికి పునరావాసం కల్పిస్తునప్పుడు ఆందోళన ఎందుకు? అని మండపడ్డారు. మూసీ ప్రక్షాళన పై పర్యావరణ వేత్తలు కూడా దృష్టి పెట్టాలని కోరారు. మూసీని జీవ నదిగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఏవి పరిశీలించకుండా మామూళ్లు తీసుకొని భవనాలకు అనుమతులు ఇస్తున్న మునిసిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
KTR: కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు సోమవారానికి వాయిదా..