NTV Telugu Site icon

Minister Sridhar Babu: భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి 100 బిలియన్ డాలర్లు..

Sridhar Babu

Sridhar Babu

Minister Sridhar Babu: మినిస్టర్ క్వార్టర్స్‌లో “NXP సెమీ కండక్టర్స్” ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమైయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి కోరారు. సెమీ కండక్టర్స్ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను కంపెనీకి వివరించారు. ఇక, 2030 నాటికి భారతదేశంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

Read Also: Mani Shankar Aiyar: రాజీవ్‌గాంధీపై మణిశంకర్ అయ్యర్ వ్యక్తిగత విమర్శలు.. బీజేపీ కోవర్టు అంటూ కాంగ్రెస్ ఫైర్

అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న AI Cityలో భాగస్వామ్యం కావాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతమైన మానవ వనరులను వినియోగించుకోవాలని చెప్పుకొచ్చారు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వామ్యం అయి.. సెమీ కండక్టర్ల పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేయాలన్నారు. సెమీ కండక్టర్స్ తయారీకి సంబంధించిన R&D యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను ఐటీ కోరారు. హైదరాబాద్‌లోని స్టార్టప్‌లు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలతో కలిసి పని చేయాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.