Insta Reel at Metro Station: ప్రస్తుతం యువత ఎక్కువ సోషల్ మీడియాలోనే సమయం గడుపుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ లైక్స్, వ్యూస్ కోసం వెంపర్లాడుతున్నారు. వీటికోసం ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. వీరికి ప్లేస్ ఎలాంటిది అనేది పట్టింపు ఉండదు. వెనుక ఏం జరుగుతోంది అనే ఆలోచన ఉండదు. పార్క్, రోడ్, మెట్రో స్టేషన్ చివరికి వాష్ రూమ్స్ ను కూడా వదలడం లేదు. తాజాగా ఒక యువతీ మెట్రో స్టేషన్ లో ఇన్స్టా రీల్ చేస్తూ దొరికింది. పబ్లిక్ ప్లేస్ లో ఆమె చేసిన రచ్చ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో ఒక యువతీ.. విక్రాంత్ రోణ చిత్రంలో రా.. రా.. రక్కమ్మ అనే సాంగ్ కు రీల్ చేసింది. ముందు వెనుక ఆలోచించకుండా దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకేం ఉంది.. సదురు యువతీ చేసిన రచ్చను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇలా పబ్లిక్ ప్లేసెస్ లో న్యూసెన్స్ చేస్తుంటే రైల్వే అధికారులు ఏం చేస్తున్నారు అంటూ వారిని కూడా ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో రైల్వే అధికారులు తక్షణమే యువతీపై చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో పై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది అమ్మాయి ని అంటుంటే.. మరికొంతమంది సోషల్ మీడియాను తప్పు పడుతున్నారు. ఇంకొంతమంది డ్రగ్స్ వలన యువత పాడైపోతుందని విమర్శిస్తున్నారు. యువత ఈ వయస్సులో డ్రగ్స్ తీసుకోవడం వలనే ఇలాంటి పనులు చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. మరి ఈ వీడియో ప్రభావం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.