GHMC: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు. బల్దియా పరిధిలో మొత్తం 150 కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు అధికారులు. ఇక, 18వ తేదీన నమోదైన నామినేషన్లు స్క్రూటినీ చేయనున్నారు. ఆ స్క్రూటినీ తరువాత 21 తేదీ వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే, 25వ తేదీన జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో పోలింగ్ జరగనుంది.
Read Also: Car Buying: ఫిబ్రవరిలో కారు కొనే వారికి గుడ్ న్యూస్.. ఈ కార్లపై బంపర్ ఆఫర్..!
అయితే, ఈ నెల 25వ తేదీన సాయంత్రం కౌంటింగ్ చేసి రిజల్ట్స్ ప్రకటించనున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో బలాబలాలు మారడంతో ఆసక్తిగా మారిన స్టాండింగ్ కమిటీ ఎన్నిక. గతంలో బీఆర్ఎస్- ఎంఐఎం పార్టీలు కలిసి స్టాండింగ్ కమిటీ సభ్యులను పంచుకున్నారు. ఇక, ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ లో జాయిన్ కావడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆసక్తి్కరంగా మారాయి.