Site icon NTV Telugu

Ganja Gang: రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. పార్క్ చేసిన కార్ అద్దాలు ధ్వంసం!

Ganja

Ganja

Ganja Gang: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఎర్రబొడ కాలనీలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. పార్క్ చేసిన కార్ అద్దాలు ధ్వంసం చేశారు. కారు అద్దాలు ఎందుకు పగలగొట్టారని ప్రశ్నించిన యజమానితో ఈ పొకిరి బ్యాచ్ దురుసుగా ప్రవర్తించింది. ఈ సందర్భంగా నాకు పగలగొట్టాలని అనిపించింది అందుకే పగలగొట్టాను, ఎక్కువగా మాట్లాడితే కారు మొత్తం తగలబెడతానని ఉల్టా బెదిరింపులకు ఈ గంజాయి బ్యాచ్ దిగింది. ఇక, అడ్డు వచ్చిన వారిపై దాడులకు పాల్పడుతూ హల్ చల్ చేశారు. దీంతో ఈ ఘటనపై పోలీసులకు చెప్పగా స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేస్తేనే వస్తామని ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో వింత సమాధానం ఇచ్చారు. ఇక, పోలీసుల తీరుపై ఎర్రబొడ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు కాకుండా లీడర్లు సముదాయిస్తున్నారని స్థానిక ప్రజలు అంటున్నారు.

Read Also: Suicide: రెండేళ్ల కుమార్తెతో ట్యాంక్ బండ్ లో దూకి వివాహిత ఆత్మహత్య

అయితే, ఎర్రబొడలో బీరప్ప గుడి మెట్లపై మద్యం సేవించి అక్కడే బీర్ బాటిల్స్ ను ఈ గంజాయి బ్యాచ్ పడేసింది. ఈ విషయంపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. గతంలో కూడా అదే ప్రాంతంలో పలుమార్లు వీళ్లు రెచ్చిపోయారు. పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తుంది. వెకిలి చేష్టలతో మహిళలు, యువతులకు వేధింపులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Exit mobile version