Site icon NTV Telugu

Hyderabad: నిజాంపేటలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

Kphb

Kphb

Hyderabad: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ప్రగతి నగర్ లోని ఆరవ డివిజన్ లో నవంబర్ 4వ తేదీన అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అంంబి చెరువుపై ఉన్న గాంధీ విగ్రహం యొక్క తల, మొండెం వేరు చేశారు. తెల్లవారుజామున ఈ సంఘటనను కాలనీవాసులు చూశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Read Also: Game Changer Teaser: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గేమ్ ఛేంజర్‌’ టీజర్ డేట్ ఫిక్స్!

ఇక, గాంధీ జయంతి రోజున హడావిడిగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు.. చెరువుకట్టపై మందుబాబులు చేసిన ఘనకార్యం అని వాకర్స్ ఆరోపిస్తున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Exit mobile version