Cognizant: హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు రేపే శంకుస్థాపన
- హైదరాబాద్ లో ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్..
- కాగ్నిజెంట్ తమ కొత్త క్యాంపస్ ను రేపు (ఈనెల14న) శంకుస్థాపన..
- కాగ్నిజెంట్ కంపెనీ శంకుస్థాపనలో సీఎం రేవంత్‌రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cognizant: హైదరాబాద్ లో ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తమ కొత్త క్యాంపస్ ను రేపు (ఈనెల14న) శంకుస్థాపన చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవికుమార్ తో చర్చలు జరిపారు. న్యూజెర్సీలో ఈనెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఒప్పందంలో భాగంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ముందుగానే వెల్లడించింది. హైదరాబాద్ లో 10 లక్షల చదనపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ ఫోకస్ చేస్తుంది.
Read also: Ponnam Prabhakar: గురుకులం విద్యార్థులకు వైద్య పరీక్షలు.. అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
Also Read
అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని ఈ నెల 14వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకోనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అదేరోజు కాగ్నిజెంట్ కంపెనీ శంకుస్థాపనలో పాల్గొంటారు. కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ కూడా హాజరవుతారు. 1994లో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హైదరాబాద్‌లో 2002 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఐటీ కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో ఐదు క్యాంపస్‌లు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 57 వేల మంది ఉద్యోగులున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్‌కు పేరుంది. గడిచిన రెండేండ్లలో ఈ కంపెనీ రాష్ట్రంలోని 34 వివిధ విద్యాసంస్థల నుంచి 7500 మంది ప్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో కాగ్నిజెంట్ కంపనీ తెలంగాణ నుంచి రూ. 7725 కోట్ల ఐటీ ఎగుమతులను నమోదు చేసింది. గడిచిన అయిదేండ్లలో కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ కింద ఈ కంపెనీ రూ. 22.5 కోట్లతో వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టింది.
Farmers Loan Waiver: రూ.31 వేల కోట్ల రుణమాఫీ.. దేశంలోనే తెలంగాణ కొత్త రికార్డు..
తాజావార్తలు
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?