M. Venkaiah Naidu: M. Venkaiah Naidu: అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ కళా ప్రదర్శనలో భాగంగా.. ఎగ్జిబిషన్‌ను భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. రేపు లోక్ మంథన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. కాగా.. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. లోక్ మంథన్ కార్యక్రమంను భాగ్యనగర్ లో నిర్వహించడం చాలా సంతోషకరం అన్నారు. మళ్ళీ తిరిగి మన మూలాలకు వెళ్ళాలన్నారు. మన సాంస్కృతిక వారసత్వాలను కాపాడుకోవాలన్నారు. మన కళలు, సంస్కృతులు, వాయిద్యాలను రక్షించుకోవాలని తెలిపారు. మన సంస్కృతిని, మన భాషను, మన సంప్రదాయాలును మర్చిపోయామన్నారు. ప్రకృతిని ప్రేమించే పవిత్ర మైన జాతి, హిందూ ధర్మం మనదని తెలిపారు. ఇంగ్లీష్ వాడు ఆర్థికంగా దోచుకోవడమే కాదు మన మనస్సును కూడా దోచుకుని వెళ్ళిపోయాడన్నారు.
Read also: CV Anand: పోలీస్ ఉద్యోగం అంటే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లాంటిది..
దేవుడి దగ్గర పోవాలని అంటే ఇంగ్లీషు రావాలనే షరతులేమి లేవని దేవుడు చెప్పారని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఎవరైనా రావాల్సిందే అని దేవుడు చెప్పారని తెలిపారు. ప్రముఖ వ్యక్తులు మాతృభాషలోనే చదువుకున్నారన్నారు. మోడీ ఇంగ్లీష్ మీడియం మొఖమే చూడలేదన్నారు. మనం భారతీయులం, మనం హిందువలమని గర్వంగా చెప్పుకోవాలని తెలిపారు. ఇంగ్లీష్ వ్యామోహం మంచిది కాదన్నారు. అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీషు నేర్చుకోవాలన్నారు. కుటుంబాలు, పెళ్ళిళ్ళు విచ్ఛిన్నం అవుతున్నాయని తెలిపారు. కుటంబ వ్యవస్థను పటిష్ఠం చేసుకుందామన్నారు. మనశ్శాంతిగా ఉంటే అనుకున్న పలితాలు సాధించవచ్చని అన్నారు. శిల్పారామంలో ప్రజ్ఞవాహిని ఆధ్వర్యంలో లోక్ మంథన్ పేరుతో కళా ప్రదర్శనల పండుగ నిర్వహిస్తున్నారు. నేటి (గురువారం) నుంచి ఆదివారం దాకా వివిధ అంశాలపై చర్చలు, సమావేశాలు జరగనున్నాయి. 12 దేశాల నుంచి 1500 మందికి పైగా కళాకారులు రాకతో సందడి వాతావరణం నెలకొంది. 120కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలకు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా.. శిల్పారామంలో నాలుగు రోజుల పాటు ఉచితంగా సందర్శన నిర్వహించనున్నారు.
Telangana Olympic: నేడు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు..