Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Former Minister Harish Rao Expressed Anger At The Telangana Government

Harish Rao: రాజ్యాంగంపై ఢిల్లీలో ఉపన్యాసాలు.. తెలంగాణలో ఇంకొక వైఖరా?

Published Date :December 17, 2025 , 6:44 pm
By Suresh Maddala
  • స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టిన హరీశ్‌రావు
  • రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని ఆరోపణ
  • ఢిల్లీలో ఉపన్యాసాలు.. తెలంగాణలో ఇంకొక వైఖరా? అంటూ నిలదీత
Harish Rao: రాజ్యాంగంపై ఢిల్లీలో ఉపన్యాసాలు.. తెలంగాణలో ఇంకొక వైఖరా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కీలక తీర్పు వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లను స్పీకర్‌ కొట్టివేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఆరోపణలను తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, గూడెం మహిపాల్‌ రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్‌లపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు.

ఇది కూడా చదవండి: Bihar: పురుషుల ఖాతాల్లో రూ.10 వేలు జమ.. అసలేం జరిగిందంటే..!

ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కారని ఆరోపించారు. సేవ్ ది కానిస్టిట్యూషన్ అంటూ రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉపన్యాసాలు ఇస్తారని.. కానీ ఆచరణలో మాత్రం ఆ నినాదం మాటలకే పరిమితమైందని ఆరోపించారు. ఆచరణలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని చెప్పారు. ‘‘ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా దెబ్బతీసిన ఈ ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన యాంటీ-డిఫెక్షన్ నియమాలను పూర్తిగా పక్కన పెట్టి.. అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం. ఇది రాజ్యాంగాన్ని కాలరాయడమే. ఇది ఎంతో సిగ్గుచేటు. ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చ.’’ అని అన్నారు.

వినోద్ కుమార్..
‘‘స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. స్వయంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పారు. కానీ ఇవాళ స్పీకర్ మాత్రం పార్టీ మారలేదు అని చెప్పడం ఎంత వరకు కరెక్ట్. 10వ షెడ్యూల్‌లో రాజ్యాంగ సవరణ చేయాలి. పార్లమెంట్‌లో వెంటనే పార్టీ ఫిరాయింపులపై ప్రత్యేక చట్టం చేయాలి.’’ అని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Parliament: ఇదిగో ప్రూప్.. ఇప్పుడేమంటారు.. ఈ-సిగరెట్‌పై మమతను ప్రశ్నించిన బీజేపీ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • congress
  • Former minister Harish Rao
  • telangana government

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions