ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లను స్పీకర్ కొట్టివేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఆరోపణలను తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్‌లపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు.
ఇది కూడా చదవండి: Bihar: పురుషుల ఖాతాల్లో రూ.10 వేలు జమ.. అసలేం జరిగిందంటే..!
ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కారని ఆరోపించారు. సేవ్ ది కానిస్టిట్యూషన్ అంటూ రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉపన్యాసాలు ఇస్తారని.. కానీ ఆచరణలో మాత్రం ఆ నినాదం మాటలకే పరిమితమైందని ఆరోపించారు. ఆచరణలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని చెప్పారు. ‘‘ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా దెబ్బతీసిన ఈ ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన యాంటీ-డిఫెక్షన్ నియమాలను పూర్తిగా పక్కన పెట్టి.. అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం. ఇది రాజ్యాంగాన్ని కాలరాయడమే. ఇది ఎంతో సిగ్గుచేటు. ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చ.’’ అని అన్నారు.
వినోద్ కుమార్..
‘‘స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. స్వయంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పారు. కానీ ఇవాళ స్పీకర్ మాత్రం పార్టీ మారలేదు అని చెప్పడం ఎంత వరకు కరెక్ట్. 10వ షెడ్యూల్‌లో రాజ్యాంగ సవరణ చేయాలి. పార్లమెంట్‌లో వెంటనే పార్టీ ఫిరాయింపులపై ప్రత్యేక చట్టం చేయాలి.’’ అని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Parliament: ఇదిగో ప్రూప్.. ఇప్పుడేమంటారు.. ఈ-సిగరెట్‌పై మమతను ప్రశ్నించిన బీజేపీ
