Site icon NTV Telugu

Fashion Designer Prathyusha : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య.. బాత్రూంలో అలా..!

Prathyusha

Prathyusha

నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ప్రత్యూష.. శనివారం ఆత్మహత్యకు చేసుకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూష గదిలో కార్బన్‌మోనాక్సైడ్‌ బాటిల్‌ లభ్యం కావడంతో.. ఆమె కార్బన్‌మోనాక్సైడ్‌ వాయువు పీల్చి మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

 

అయితే.. అనంతరం, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా ప్రత్యూష గుర్తింపు పొందారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్లకు ప్రత్యూష డ్రెస్‌లు డిజైన్‌ చేశారు. దేశంలోని 30 మంది ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్స్‌లో ప్రత్యూష ఒకరుగా గుర్తింపు పొందారు.

https://www.youtube.com/watch?v=neNGfczZ3O4

Exit mobile version