Site icon NTV Telugu

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు..

Sit

Sit

Phone Tapping Case: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నేతలే టార్గెట్ గా పని చేసినట్లు తెలుస్తుంది. ధర్మపురి అరవింద్, జితేంధర్ రెడ్డిలా ఫోన్లను అధికారులు ట్యాప్ చేసినట్లు సమాచారం. ఇక, ఉప ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి ఫోన్ లతో పాటు అనుచరులు మరో 200 మంది ఫోన్ లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా బీజేపి నాయకుల ఫోన్ లు ట్యాప్ చేసినట్లు సిట్ తేల్చింది.

Read Also: Fake Baba : గుప్త నిధుల పేరిట మోసం.. దొంగ బాబాలు అరెస్ట్‌

అయితే, విచారణ సందర్భంగా ప్రణీత్ రావు సంచలనం విషయాలు వెల్లడించినట్లు తెలుస్తుంది. ఎస్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా ఫోన్ టాపింగ్ ఎంక్వైరీ కొనసాగుతుంది. ప్రణీత్రావు, ప్రభాకర్ రావులను ఎఫ్‌సీఎల్ రిపోర్టర్ ఆధారంగా విచారణ చేస్తున్నారు అధికారులు. ఇక, మరోసారి ఈరోజు (జూన్ 14న) మాజీ ఇంటెలిజెన్ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు హాజరుకానున్నారు.

Exit mobile version