Site icon NTV Telugu

KCR: తొందర పడకండి.. ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక భేటీ..!

Kcr

Kcr

KCR: సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలోని ఫాం హౌస్ కి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. గత రెండు రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారి లక్ష్మా రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలు ఎర్రవల్లిలోని ఫాం హౌస్ కి వెళ్లారు.

Read Also: Kalki 2898 AD: తుఫాన్ కాదిది సునామీ.. రిలీజ్ కు ముందే 14 లక్షల టిక్కెట్ల అమ్మకం!

కాగా, తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్యేలతో మాజీ సీఎం కేసీఆర్ చర్చించారు. పార్టీకి చెందిన ఎమ్మె్ల్యేలకు పలు కీలక సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ రావొద్దని సూచించారు. అయితే, దాదాపు 2 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంగా ముగిసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఈ సమావేశంపై మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తో చాలా విషయాలు చర్చించాము.. అవన్నీ సీక్రెట్, బయటకు చెప్పడం కుదరదు అని పేర్కొన్నారు. కాగా, నిన్న ( మంగళవారం ) కూడా గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతోనూ గూలాబీ బాస్ కేసీఆర్ సమావేశం అయ్యారు.

Exit mobile version