Engineering College Fee: విద్యార్థులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులు
- ఇంజనీరింగ్ విద్యార్థులకు బిగ్ షాక్..
- వచ్చే విద్య సంవత్సరం నుంచి భారీగా పెరగనున్న కాలేజీ ఫీజులు..
- కొత్త ఫీసులను ప్రభుత్వానికి సిఫార్స్ చేయనున్న టీఏఎఫ్ఆర్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Engineering College Fee: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులు భారీగా పెరగనున్నాయి. ఈసారి సీబీఐటీ ఏడాది ఫీజును రూ.2.23 లక్షలుగా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఆ కాలేజీలతో పాటు వీఎన్‌ఆర్, ఎంజీఐటీ తదితర కళాశాలలకు కూడా ట్యూషన్ ఫీజు రూ.2 లక్షలకు చేరుకున్నట్లు సమాచారం. వచ్చే మూడేళ్ల బ్లాక్ పిరియడ్‌కు కొత్త ఫీజులను ఫిక్స్ చేసేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) గత నెల 25వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కళాశాలల యాజామాన్యాలు, ప్రతినిధులతో విచారణ జరిపింది. కాలేజీలు గతంలో సమర్పించిన గత మూడేళ్ల ఆడిట్ నివేదికలను పరిశీలించి కొత్త ఫీజులను యాజమాన్య ప్రతినిధులకు కమిటీ తెలియజేసింది. దాదాపు అన్ని కాలేజీల యాజమాన్యాలు కమిటీ చెప్పిన ఫీజుకు ఒప్పుకున్నాయి.
Read Also: SRH Players: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కూతురు రిసెప్షన్‌కు ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ ఆటగాళ్లు.. వీడియో వైరల్!
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
అయితే, కొన్ని కాలేజీలకు భారీగా పెరగగా, మరికొన్నిటికి నామమాత్రంగానే పెరిగాయి. గతంలో సాంకేతిక కారణాల వల్ల కొన్ని ప్రముఖ కళాశాలలకు తక్కువ ఫీజు పెంచారని. దాని వల్ల ఈసారి ఆ కాలేజీలకు ఎక్కువగా పెరిగాయని పేర్కొన్నారు. ఇక, ఖరారు చేసిన ఫీజును కమిటీ తెలంగాణ ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. దాన్ని సర్కార్ పరిశీలించి జీవో జారీ చేయాల్సి ఉంది. ఒకవేళ ఫీజులు ఎక్కువగా ఉన్నాయని భావిస్తే పునఃసమీక్ష చేయాలని సూచనలు చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
Read Also: BRS MLC Pochampally: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి మరోసారి పోలీసుల నోటీసులు..
కాలేజీలకు ఖరారు చేసిన ఫీజులు ఇలా ఉన్నాయి
కళాశాల పేరు- పాత ఫీజు- కొత్త ఫీజు
* సీబీఐటీ- రూ.1.65 లక్షలు- రూ.2.23 లక్షలు
* వీఎన్‌ఆర్- రూ.1.35 లక్షలు- రూ.2.20 లక్షలు
* వాసవి- రూ.1.40 లక్షలు- రూ.2.15 లక్షలు
* ఎంజీఐటీ- రూ.1.60 లక్షలు- రూ.2 లక్షలు
* సీవీఆర్- రూ.1.50 లక్షలు- రూ.1.98 లక్షలు
* ఎంవీఎస్‌ఆర్- రూ.1.30 లక్షలు- రూ.1.60 లక్షలు
* మాతృశ్రీ- రూ.లక్ష- రూ.1.02 లక్షలు
* జేబీఐటీ- రూ.1.10 లక్షలు- రూ.1.15 లక్షలు
* జేబీఆర్‌ఈసీ- రూ.87 వేలు- రూ.1.06 లక్షలు
* స్టాన్లీ మహిళ- రూ.85 వేలు- రూ.95 వేలు
* మెథడిస్ట్- రూ.78 వేలు- రూ.86 వేలు
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!