Site icon NTV Telugu

Minister Seethakka: జీవితంలో అన్నిటికంటే ఉత్తమమైనది విద్య.. చదువుతోనే విజ్ఞానం పెరుగుతుంది!

Seethakka

Seethakka

Minister Seethakka: లక్డికాపూల్ లోని FTCCI కార్యాలయంలో విద్యాధన్ స్వచ్ఛంద సంస్థ స్కాలర్ షిప్ ల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవితంలో అన్నిటికంటే ఉత్తమమైనది విద్య.. విద్యతోనే వికాసం సాధ్యపడుతుంది అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చి 6-14 సంవత్సరాల మధ్య పిల్లలకు నిర్బంధ విద్యను ప్రవేశ పెట్టింది.. విద్యను ఎవరు దోచుకోలేరు, విద్య పంచుకుంటేనే విజ్ఞానం పెరుగుతుందని పేర్కొన్నారు.. ఆ ఉద్దేశంతో విద్యాధన్ ఫౌండేషన్ పని చేయడం అభినందనీయం అని చెప్పుకొచ్చారు. మీ ప్రయత్నాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క వెల్లడించారు.

Read Also: AP Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకంపై కీలక అప్‌డేట్..

ఇక, విద్య ద్వారానే నా లైఫ్ ఈ స్థాయికి వచ్చిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. నేను టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న తర్వాత పదేళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపాను.. బయటకొచ్చిన తర్వాత తిరిగి విద్యార్థిగా చదువును కొనసాగించానని తెలిపారు. చదువుకోవాలన్న పట్టుదలతో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఎంఏ, పీచ్డీ పూర్తి చేశాను అని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా విద్యను ఆపలేదు.. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఎంఏ కోర్సును జాయిన్ అవ్వాలనుకుంటున్నాను.. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పది, జ్ఞానాన్ని లక్షల మందికి పంచడం ద్వారా సమాజ అభివృద్ధికి కృషి చేసిన వాళ్లమవుతామని ఆమె వెల్లడించారు. విద్యాభివృద్ధిలో నేటికీ అంతరాలు కొనసాగుతున్నాయి.. ఆ అంతరాలను తొలగించే దిశలో అంతా కలిసికట్టుగా పని చేయాలి.. మారిన పరిస్థితుల్లో మానవ సంబంధాలు బలహీన పడుతున్నాయి.. మానవ విలువలను, సంబంధాలను పటిష్టం చేసే విద్యను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పేదలకు విద్య అందించే విద్యాధన్ ఫౌండేషన్కు మా ప్రభుత్వ సహకారం ఎల్లవేళలా ఉంటుందని మంత్రి సీతక్క చెప్పుకొచ్చింది.

Exit mobile version