Site icon NTV Telugu

KTR: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి రాష్ట్రంలో విద్య, వ్యవసాయం కుంటుపడింది..

Ktr

Ktr

KTR: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే కాదు అని కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్ ) మండిపడ్డారు. విద్యా వ్యవస్థ కూడా కుంటుపడింది.. వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత లేదు అని పేర్కొన్నారు. విద్యావ్యవస్థ పట్ల బాధ్యత లేదు.. వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతు రోసా అమలు విషయంలో ప్రణాళిక లేదు అని ఆరోపించారు. పాఠశాలలు ప్రారంభమైనా పాలకులు నిర్లక్ష్యం వీడడం లేదు.. అరకొర రుణమాఫీ, ఆచూకీ లేని రైతు భరోసా, అందని రైతు మా, ప్రాజెక్టులు పడావు అని విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పండగలా మారిన వ్యవసాయం.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరోగమనం వైపు పయనిస్తోంది అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Air India Plane Crash: ఎయిరిండియా విమాన దర్యాప్తు కోసం భారత్ రానున్న బ్రిటిష్ ఏజెన్సీ..

ఇక, 1000కి పైగా సంక్షేమ గురుకులాల ఏర్పాటుతో ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తెలంగాణ విద్యా వ్యవస్థ.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అవస్థలు ఎదుర్కొంటున్నది అని కేటీఆర్ విమర్శించారు. తక్షణమే రాష్ట్రంలో విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులను అందించాలని డిమాండ్ చేశారు. అలాగే, రైతులకు ఎరువులను, విత్తనాలను అందించాలి.. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

Exit mobile version