Mallu Bhatti Vikramarka: ఆరోగ్య సంరక్షణకు ‘ఫార్మా’ పరిశ్రమ వెన్నుముక లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 73వ ఫార్మా కాంగ్రెస్ లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. దేశంలో 35 శాతం ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ నుంచే ఇది మన రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ప్రతి ఏటా 50వేల కోట్ల విలువైన మందులు ఎగుమతి చేస్తున్నామన్నారు. మాది పారిశ్రామిక ఫ్రెండ్లీ గవర్నమెంట్ 24 గంటలు మా క్యాబినెట్ అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమకు ఎలాంటి సమస్య రానివ్వమన్నారు. ఓఆర్ఆర్. ఆర్ఆర్ఆర్ మధ్యలో ఫార్మా క్లస్టర్లు నిర్మించి.. ఈ పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. పరిశ్రమలకు విద్యుత్తు, నీటి సమస్య లేదని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతున్నమని అన్నారు.
Read also: Srisailam: శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం, నంది విగ్రహం..
గ్రీన్ ఎనర్జీ, మిగులు విద్యుత్ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆరోగ్య సంరక్షణకు ఫార్మా పరిశ్రమ వెన్నుముక లాంటిదని తెలిపారు. రోగుల భద్రత, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ఫార్మ రంగానిది కీలకపాత్ర అన్నారు. అత్యధిక నాణ్యతతో జనరిక్ మెడిసిన్ ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తూ తెలంగాణ గుర్తింపు సాధించిందని తెలిపారు. కరోనా కాలంలో ఫార్మసిస్టులు అసమానమైన చురుకుదనం ప్రదర్శించి, అవిశ్రాంతంగా శ్రమించారన్నారు. బిర్యానీ తోపాటు బయో ఫార్మకు ఇప్పుడు హైద్రాబాద్ ప్రసిద్ధి చెందిందన్నారు. సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేసే స్థాయి నుంచి జీవితాలను కాపాడే మందుల సరఫరా దశకు తెలంగాణ రాష్ట్రం చేరుకుందన్నారు. అందరికీ ఆరోగ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తే దృఢమైన ప్రపంచాన్ని నిర్మించగలమన్నారు.
Kubera: ‘కుబేర’ నుంచి రష్మిక వీడియో వచ్చేసింది.. వామ్మో గొయ్యి తవ్వి మరీ..!