Mallu Bhatti Vikramarka: ప్రగతి భవన్ వేదికగా సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పంపిణీ చేశారు. ప్రకటనలకే పరిమితం కాకుండా పండుగకు ముందే కార్మికులకు బోనస్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అందుకోసం తమ ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈరోజు ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భట్టి విక్రమార్క కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టు మేము చేయదలుచుకోవడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిలబెట్టాలనే నిబద్ధత మాదన్నారు. సింగరేణి కాపాడుదాం అని తెలిపారు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఆర్టీసీ దివాలా తీసి ఉందని తెలిపారు. అలాంటి ఆర్టీసీని మహాలక్ష్మి పేరుతో బతికించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సింగరేణి ని విస్తరించాలని అధికారులకు ఆదేశిస్తున్నామన్నారు. ఆర్టీసీకి నెలకు 400 కోట్లు ఇచ్చి ఆ సంస్థను బతికిస్తున్నామన్నారు. సింగరేణిలో శ్రమదోపిడి జరగకూడదన్నారు.
Read also: Banana Face Mask: అరటి పండుతో ఇలా ట్రై చేయండి..
కార్మికులకు కనీస వేతనం చెల్లించాల్సిందే అని తెలిపారు. గుండు సూదిని కూడా ఉత్పత్తి చేయలేని భారతదేశాన్ని మిశ్రమ ఆర్థిక విధానంతో గొప్ప పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దిన నాయకుడు దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. సింగరేణి కార్మికుల కోసం ఏం చేయడానికైనా సీఎం సిద్ధంగా ఉన్నారని భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్‌ఎస్ తరహాలో తాత్కాలికంగా, తూతూ మంత్రంగా పని చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, సంస్థను అభివృద్ధి దిశగా నడిపించేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. సింగరేణి సంస్థ , ఆస్తి కార్మికులదేనని అన్నారు. వారిని ఆదుకుని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాత్రమే ప్రభుత్వానిదేనన్నారు. సింగరేణి సంస్థ ఆధీనంలో ఉన్న ఒక్క గని కూడా బయటకు వెళ్లకుండా చూసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందని, అవసరమైతే కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అనంతరం కార్మికులకు చెక్కులు పంపిణీ చేశారు.
CPI Narayana: ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు