NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి గుడ్ న్యూస్.. రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు..

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే ఆరు హామీ పథకాలపై సంతకాలు చేయగా.. కొద్ది రోజుల్లోనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం. రూ.500కే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, త్వరలో అర్హులైన మహిళలకు రూ.2500 ఇస్తామని ప్రకటించారు. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ మహిళలకు శుభవార్త అందించారు.

Read also: CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి..

నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళలకు ఏటా రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందజేస్తామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు అందజేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ త్వరలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 ఇళ్లకు భూమిపూజ చేయనున్నారు. గత పాలనలో అప్పులు చేసి ప్రగల్భాలు పలికారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిజం చేస్తామన్నారు. రైతులకు రెండు లక్షల రుణాలు మాఫీ చేశాం. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదలైంది. మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తాం. ప్రజలు తమ పార్టీని నమ్మి అధికారం ఇచ్చారని.. వారి సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు.
CM Revatnh Reddy: అదాని కుంభకోణంపై నేడు సీఎం రేవంత్ ధర్నా.. భారీ ప్రదర్శన..