NTV Telugu Site icon

Hydra Demolishing: గగన్ పహాడ్ లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు..

Hydra

Hydra

Hydra Demolishing: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) అక్రమ కూల్చివేతలను కొనసాగిస్తోంది. ఈరోజు (శనివారం) గగన్ పహాడ్ లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇవాళ తెల్లవారుజాము నుంచి అప్నా లేక్ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను భారీ బందోబస్తు మధ్య కూల్చివేస్తున్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేసే ప్రదేశంలోకి మరెవరూ రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను బుల్‌డోజర్‌లతో నేలమట్టం చేస్తున్నారు. అప్ప చెరువు మొత్తం విస్తీర్ణం 35 ఎకరాలు. 3.5 ఎకరాలు ఆక్రమించుకుని గోడౌన్లు నిర్మించుకున్నారని హైడ్రా అధికారులు సమాచారం. ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ కట్టడాలను తొలగించాలని బిల్డర్లను ముందుగానే హెచ్చరించినా.. వారి నుంచి కదలిక రాకపోవడంతో హైడ్రామా రంగంలోకి దిగింది. అయితే అయితే కూలుస్థున్న గౌడన్ లు స్థానిక మైలార్దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి వే అని స్థానికంగా తెలుస్తోంది. కాసేపటి క్రితం తోకల శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కూలుస్తున్న గౌడపై శ్రీనివాస్ రెడ్డి ఏలాంటి స్పందన లేకపోవడం విశేషం.

Read also: Telangana Projects: భారీ వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ..

నేడు ఇరిగేషన్ అధికారుల సమాచారం ప్రకారం 3.5 ఎకరాలు మాత్రమే కబ్జా కు గురైనట్లు తెలుస్తోంది.. కానీ 2014 లోనే 4 ఎకరాలు.. 2020 వరకు 6.8 ఎకరాలు అప్పా చెరువు ఎఫ్టీఎల్ స్థలం కబ్జా జరిగిందంటూ స్థానికంగా మరో సమాచారం.. మొత్తం 13 నిర్మాణాలను గుర్తించిన హైడ్రా అధికారులు. ఇప్పటివరకు రెండు నిర్మాణాలు కూల్చి వేసిన హైడ్రా అధికారులు. వర్షం పడుతున్నా కూడా ఆగని కూల్చివేతలు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కాల్వలు, కుంటల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో పరుగులు పెడుతోంది. బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు, పెద్ద భవనాలను ఎక్కడికక్కడ ఎఫ్‌టీఎల్‌ ధ్వంసం చేస్తోంది. ఇందులో భాగంగా హీరో నాగార్జు ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చేసిన సంగతి తెలిసిందే.
Helicopter Crash: కేదార్‌నాథ్‌లో కూలిపోయిన హెలికాప్టర్..