NTV Telugu Site icon

CP Anand: హైదారాబాద్ సీపీ గా భాద్యతలు తీసుకున్న సీవి ఆనంద్..

Cp Cv Anand

Cp Cv Anand

CP Anand: హైదరాబాద్ 61వ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం సీపీ కార్యాలయంలో ప్రస్తుత సీపీ శ్రీనివాస్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ సీపీగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. డ్రగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. సోమవారం ఉదయం సీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. వినాయకచవితి, మిలాద్ ఉన్ నబి ఉంది.. ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తానని తెలిపారు. గతేడాది కూడా రెండు పండుగలు ఒకేసారి వచ్చాయి.. ప్రశాంతంగా జరిపాం అన్నారు. యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంది.. అధికారులతో సమీక్ష నిర్వహిస్తాం అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై సీరియస్‌గా ఉంది. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తాం అన్నారు.

Read also: DCP Narasimha: బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ టార్గెట్ గా యూపీఐ మోసాలు.. అదుపులో 13 మంది

నేరస్తులపై ఉక్కుపాదంతో కఠినంగా వ్యవహరిస్తామని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. కాగా, 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ డిసెంబర్ 2021 నుంచి అక్టోబర్ 2023 వరకు హైదరాబాద్ సీపీగా పనిచేశారు. తెలంగాణ కేడర్‌కు చెందిన సీవీ ఆనంద్‌ 2017లో అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా పదోన్నతి పొందారు. కేంద్ర సర్వీసులకు వెళ్లి 2021లో తెలంగాణకు తిరిగి వచ్చారు. ఆగస్టు 2023లో డీజీపీ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఎన్నికల సమయంలో ఆయనను సీపీ పదవి నుంచి తప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆనంద్‌కు ఏసీబీ డీజీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ సీపీగా నియమితులై బాధ్యతలు చేపట్టారు.
Kalki Vinayakudu: కాంప్లెక్స్‌ను పోలిన మందిరం.. అశ్వత్థామగా వినాయకుడు! వీడియో వైరల్‌