NTV Telugu Site icon

CPI Red Salute Rally: తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ రెడ్ సెల్యూట్ ర్యాలీ..

Cpi

Cpi

CPI Red Salute Rally: హైదరాబాద్ నగరంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ సీపీఐ రెడ్ సెల్యూట్ ర్యాలీ నిర్వహించింది. కవులు, కళాకారులతో కలిసి ముగ్దమ్ స్టాచ్యు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రెడ్ టీ షర్ట్స్ ధరించి ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంభాశివరావు, చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే గుర్తించబడిన సాయుధ పోరాటం స్టార్ట్ అయినా రోజు.. నిజం నిరంకుశం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసారు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ అధికారంలోకి వచ్చిన సాయుధా పోరాటం చేసిన వారిని గుర్తించండి, వాళ్ళను ఆదుకోండి అని కోరారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా జరిపేందుకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంఐఎం పార్టీ బ్లాక్ మెయిల్ కు భయపడుతోంది అని సీపీఐ నారాయణ ఆరోపించారు.

Read Also: Rohit Sharma-MI: ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లే!

ఇక ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావు మాట్లాడుతూ.. ఆనాడు సాయుధ పోరాటం జరగకపోతే తెలంగాణ భారతదేశంలో విలీనం అయ్యేది కాదు అన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా చేస్తున్నారు.. ఎంఐఎం, ఆర్ఎస్ఎస్ లకు భయపడి సాయుధ పోరాటాన్ని పక్క దారి పట్టిస్తున్నారు.. మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టడం సంతోషం.. ఆనాడు సాయుధ పోరాటంలో లేని వారు హిందూ, ముస్లిం మధ్య గొడవలు పెడుతున్నారు అని ఆరోపించారు. సిలబస్ లో సాయుధ పోరాటం చరిత్రను పెట్టాలి అని కూనంనేని డిమాండ్ చేశారు.

Read Also: YS Jagan: చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్.. అందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌..!

కాగా, చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రోజు అన్నారు. బద్దం, రావి నారాయణరెడ్డి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు.. సాయుధ పోరాటం లేకపోతే తెలంగాణ మరో పాకిస్తాన్ గా ఉండేది.. హైదరాబాద్ లో స్మృతివనం ఏర్పాటు చేయండి అని కోరారు. మీరు ఎంఐఎంకు భయపడి అధికారం చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు.