Rohit Sharma-MI: ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లే!
- ఏడాది చివరలో ఐపీఎల్ 2025 మెగా వేలం
- అందరి చూపు రోహిత్ శర్మపైనే
- ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది చివరలో ఐపీఎల్ 2025కు సంబందించిన మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. మెగా వేలం నేపథ్యంలో అందరి చూపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపైనే ఉంది. ఇందుకు కారణం ముంబై ఇండియన్స్‌కు ఐదుసార్లు ట్రోఫీలు అందించిన రోహిత్.. ఆ జట్టులోనే కొనగాగుతాడా? లేదా? అని. గత కొంత కాలంగా హిట్‌మ్యాన్ ఐపీఎల్ భవితవ్యంపై చర్చ కొనసాగుతోంది. ముంబైలో ఉండడం రోహిత్‌కు ఇష్టం లేదని, వేరే జట్టుకు వెళ్లిపోతాడు అని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనేపథ్యంలో రోహిత్ భవితవ్యంపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తన యూట్యూబ్ ఛానల్‌లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లే అని అభిపాయపడ్డాడు. ‘రోహిత్ శర్మ ముంబైతో ఉంటాడా? లేదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. హిట్‌మ్యాన్ ముంబైతో ఉండడని నేను అనుకుంటున్నా. మూడేళ్లు ఆడగలిగితేనే జట్టులో రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎంఎస్ ధోనీకి ఇది వర్తించదు. ధోనీ – చెన్నై కథ వేరు. రోహిత్ స్వయంగా ముంబై నుంచి వెళ్లిపోవచ్చు లేదా ముంబై మేనేజ్మెంటే అతడిని విడిచిపెట్టవచ్చు. ఏదైనా జరగొచ్చు’ అని ఆకాశ్ అన్నాడు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: Devara Part 1: ‘దేవర’ కొత్త కథ కాదు.. కానీ కొత్త కొరటాలను చూస్తారు!
‘ఏదేమైనా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌లో కొనసాగుతాడని నేను అస్సలు అనుకోవడం లేదు. నా వద్ద రోహిత్ గురించి పెద్దగా సమాచారం లేదు కానీ.. హిట్‌మ్యాన్‌ను ముంబై వదిలేస్తుందని అనుకుంటున్నా. ఐపీఎల్ 2025 వేలంలో రోహిత్‌ను వేరే జట్లు తీసుకోవచ్చు. అతడికి భారీ ధర ఖాయం. ముంబై ఇండియన్స్‌తో అతడి ప్రయాణం ఇక ముగిసినట్లేనని నేను అనుకుంటున్నా’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024 ముందు రోహిత్‌ను తప్పించి.. హార్దిక్ పాండ్యాకు జట్టు సారథ్య బాధ్యతలు ముంబై అప్పగించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి హిట్‌మ్యాన్ నిరాశలో ఉన్నాడట.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..