వాటర్ ట్యాంక్లో మృతదేహం.. షాకైన సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముషీరాబాద్ హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయడానికి వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బందికి మృతదేహం కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే సిబ్బంది వాటర్ వర్క్స్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ రవి చారి, వాటర్ వర్క్స్ ఇన్ స్పెక్టర్ లు చేరుకున్నారు.
ట్యాంక్పై చెప్పులు ఉండడంతో అవి మృతునికి సంబంధించినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతునికి సంబంధించిన ఆనవాళ్లు చెప్పులను బట్టి మృతుని వయసు 35 నుండి 40 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ విషయం తెలియడంతో ఘటన స్థలం వద్దకు పెద్ద ఎత్తున్న స్థానికులు చేరుకున్నారు.
Also Read
- Indigo : పవర్ బ్యాంక్లో మంటలు.. శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!