ముషీరాబాద్ హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయడానికి వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బందికి మృతదేహం కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే సిబ్బంది వాటర్ వర్క్స్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ రవి చారి, వాటర్ వర్క్స్ ఇన్ స్పెక్టర్ లు చేరుకున్నారు.…