Site icon NTV Telugu

CM Revanth Reddy: రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్దే అధికారం

Revanth

Revanth

CM Revanth Reddy: గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కుల గణన చేసేలా చేయడంలో మనం విజయం సాధించాం.. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం చాలా విజయాలు సాధించాం.. ఇక, నేను పీసీసీగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారు.. యూత్ కాంగ్రెస్, NSUI, పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి మన ప్రభుత్వంలో పదవులు వరించాయి.. పార్టీ పదవులను క్యాజువల్ గా తీసుకోవద్దు.. పార్టీ పదవులతోనే మీకు గుర్తింపు, గౌరవం వస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

Read Also: Indian Army: “ఒక సరిహద్దు ముగ్గురు శత్రువులు”.. ఆపరేషన్ సిందూర్‌పై భారత సైన్యం..

అయితే, రాజకీయాల్లో మీ ఎదుగుదలకు ఇది ఉపయోగపడుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి.. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషను, జమిలి ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయి.. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలి అని సూచించారు. మీరు నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలి అన్నారు. గ్రామాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పర్యటించి సమన్వయంతో పని చేయాలి.. మన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర వేయాలి.. మనందరం కలిసికట్టుగా ఈరోజు నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుని కష్టపడి మళ్లీ రెండోసారి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకు రావాలని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన అరుదైన ఘనత మల్లికార్జున ఖర్గేది.. వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Exit mobile version