NTV Telugu Site icon

Jagga Reddy: రాహుల్ గాంధీని ప్రధాని చేసి ఉంటే.. మేమే ఐటీఐఆర్ తెచ్చే వాళ్ళం..!

Jaggareddy

Jaggareddy

ఐదు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఐటీఐఆర్ గురించి మాట్లాడిన.. యువతకు ఉద్యోగాల అంశం కాబట్టి మాట్లాడాను అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 2014 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చి దాన్ని రద్దు చేశారు.. వాస్తవం కాబట్టి మాట్లాడినా, అవగాహన లేకుండా.. అనాలోచితంగా కూడా మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు. మోడీ రద్దు చేయకపోయి ఉంటే పదేళ్ళలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవి.. ఆధారాలతోనే నేను మాట్లాడిన.. ఇప్పుడు ఆధారాలు కూడా చూపెడుతున్నాను.. రాజకీయ విమర్శ కాదు.. ప్రభుత్వం మీద విమర్శ చేయాలని చేస్తుంది కాదు అని జగ్గారెడ్డి తెలిపారు.

Read Also: Pranava Rudranush County: శామీర్‌పేట లేక్‌కు దగ్గరగా.. ప్రకృతి ఒడిలో ‘రుద్రాన్ష్ కౌంటీ’

ఇక, ఐటీఐఆర్ మళ్ళీ తీసుకుని రావాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ అనుకుని ఉన్న నాలుగు ఎంపీ సీట్లను బీజేపీకే ఇచ్చారు ప్రజలు.. రఘునందన్ రావు.. మీకు ప్రజలు బాధ్యత ఇచ్చారు కాబట్టి అడుగుతున్నాం.. రాహుల్ గాంధీని ప్రధాని చేసి ఉంటే.. మేమే ఐటీఐఆర్ తెచ్చే వాళ్ళం అని పేర్కొన్నారు. మేము ప్రతిపక్ష పార్టీగా ఐటీఐఆర్ కావాలని అడుగుతున్నాం.. మంజూరు చేయించి మీరే క్రెడిట్ తీసుకోండి.. పార్లమెంట్ సమావేశాలు అయిపోయాక.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని కలిసి వినతి పత్రం అందిస్తామన్నారు. రద్దైన ఐటీఐఆర్ మళ్ళీ తెండి అని అడుగుతా.. సెప్టెంబర్ లో ఐటీఐఆర్ అనుమతి వచ్చింది.. ఐటీ ఏర్పాటుకు 50 వేల ఎకరాల్లో పెడితే.. 60 లక్షల ఉద్యోగాలు వచ్చేవి అని అంచనా వేశారు.. కానీ, 2016 ఏప్రిల్ లో మోడీ ప్రభుత్వం ఐటీఐఆర్ పక్కన పెట్టింది.. ఇప్పటికైనా, 8 మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఐటీఐఆర్ తేవాలి అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఐదు రోజులకు ఒకసారి దీని మీద మాట్లాడతా.. రూలింగ్ పార్టీకి గుర్తు చేయడమే మా బాధ్యత కాబట్టి గుర్తు చేస్తున్నామని జగ్గారెడ్డి వెల్లడించారు.

Show comments