Niranjan Reddy: కాంగ్రెస్ రైతుల కోసం ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ అమలు కావడం లేదు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతుబంధు, రైతు బీమా దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రూ. 6,122 కోట్లు రైతులకు ప్రీమియం కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది.. కానీ, కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటు, రైతుబంధు, రైతు బీమా రావడం లేదు అని ఆరోపించారు. రైతు భరోసా కోసం ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి రూ. 10 వేల కోట్లు తెచ్చి ఏం చేశారు అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి.. చీఫ్ సెక్రటరీతో ప్రభుత్వం అబద్దాలు చెప్పిస్తోంది.. రైతుల పంటలు ఎండుతుంటే రైతు కమీషన్ ఏం చేస్తోంది.. ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ శాఖ మంత్రులు రైతుల దగ్గరకు వెళ్ళండి నిరంజన్ రెడ్డి సూచించారు.
Read Also: Top Headlines @1PM: టాప్ న్యూస్!
ఇక, SLBC టన్నెల్ కూలితే కేసీఆర్ కారణమని అంటున్నారు.. రైతుల పంటలకు నీళ్లు ఇవ్వకపోవడానికి కారణం కేసీఆర్ అని అంటారా?.. అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అడిగారు. రైతుల దగ్గరకు వెళ్ళే ధైర్యం మంత్రులకు ఉందా?.. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు.. సమయం వచ్చినప్పుడు రైతులు ప్రభుత్వాన్ని శిక్షించండి అని ఆయన పేర్కొన్నారు. చేతులు జోడించి చెబుతున్నాను.. రైతులు తమ ప్రాణాలను తీసుకొని శిక్షించుకోవద్దు అన్నారు.