NTV Telugu Site icon

HCU Tension: హెచ్సీయూ భూముల వేలంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు

Hcu

Hcu

HCU Tension: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాటపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో హైకోర్టు న్యాయవాది కారుపోతుల రేవంత్ ఫిర్యాదు చేశారు. అయితే, గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి హెచ్సీయూకి చెందిన 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసమని వేలం పాట వేయడాన్ని యావత్ విద్యార్థులోకంతో పాటు పర్యావరణవేత్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కానీ, తెలంగాణ సర్కార్ మాత్రం ఎలాంటి పునరాలోచన చేయకుండా మూర్ఖంగా ముందుకు పోవడంతో చెన్నై లోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో హైదరాబాద్ కు చెందిన న్యాయవాది రేవంత్ కంప్లైంట్ చేశారు.

Read Also: IPL 2025: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవ‌న్.. రోహిత్ శ‌ర్మ‌కు దక్కని చోటు!

ఈ హెచ్సీయూ భూముల వేలం పాటను అడ్డుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని న్యాయవాది రేవంత్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం.. ఈ విధంగా పారిశ్రామిక అభివృద్ధి పేరిట పచ్చని చెట్లు, వివిధ రకాల జీవరాశులతో చక్కటి వైద్యం కలిగినటువంటి భూమిలోని చెట్లను నరికి వేయడం ఒక అవివేకమైనటువంటి చర్య అని మండిపడ్డారు. అయితే, ప్రస్తుతం ఈ 400 ఎకరాలలో అనేక రకాల జీవరాశులు, వివిధ రకాల వృక్షాలతో కాలుష్యంతో నిండిపోయిన హైదరాబాద్ కు ఉపశమనం కల్పిస్తుందన్నారు. ఇలాంటి పర్యావరణ ప్రాంతాలను రూపుమాపాలనుకోవడం మంచిది కాదని సూచించారు. అలాగే, దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో న్యాయపరంగా కొట్లాడి న్యాయం పొందే వరకు పోరాటం చేస్తామన్నారు.