Telangana Weather: తెలంగాణలో మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలోనే నమోదయ్యాయి. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ముఖ్యంగా తెల్లవారుజామున పొగ మంచును కప్పేస్తుంది. అయితే గత 2 రోజులుగా మళ్లీ చలి పెరిగే అవకాశాం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా మారనుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.
తెలంగాణలోని ఉమ్మడి జిల్లాపై చలి పులి పంజా విసురుతుంది. ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత మళ్ళీ పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రతతో స్థానికులు చలి మంటలు పెట్టుకుంటున్నారు.
చలి తీవ్రత..
* మెదక్ జిల్లా శివంపేటలో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
* సంగారెడ్డి జిల్లా నల్లవల్లిలో 9.7, కంగ్టి 9.8, కోహిర్ 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
* సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ లో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
* ఆదిలాబాద్ జిల్లా బేల లో 7 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.
* కొమురం భీం జిల్లా సిర్పూర్ టి లో 7.3గా నమోదు.
* నిర్మల్ జిల్లా పెంబి లో 8.3 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.
* మంచిర్యాల జిల్లా తపాలా పూర్ లో 10.8గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.
Astrology: డిసెంబర్ 12, గురువారం దినఫలాలు