NTV Telugu Site icon

CM Revanth Reddy: ఆడబిడ్డల కోసం మహాలక్ష్మీ పథకంలోని మరో పథకం 500లకే వంట గ్యాస్..

Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy: ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిందే మహాలక్ష్మీ పథకంలోని మరో పథకం 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన. 2014 లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే నాటికి గ్యాస్ బండ ధర 410 రూపాయలు మాత్రమే. పదేళ్లలో దానిని 1200 రూపాయలకు పెంచిన పాలన మీరు చూశారు. అందుకే తిరిగి దాన్ని 500 రూపాయలకే ఇవ్వాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి, 27న ప్రారంభించాం. 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం… ప్రస్తుతం 43 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతోంది. సబ్సిడీ కింద లబ్ధిదారులు ఉపయోగించిన 85 లక్షల 17 వేల 407 సిలిండర్లకు గాను 242 కోట్ల రూపాయలు చెల్లించాం. అల్పాదాయ వర్గాలవారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి, వారి గృహాలలో చీకట్లను పారదోలి, విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలుచేస్తున్నామని అన్నారు.

Read also: CM Revanth Reddy: దేశ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది..

200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024 మార్చిలో ప్రారంభించాం. ప్రజాపాలన సేవాకేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపచేస్తున్నాం. ప్రస్తుతం 47 లక్షల 13 వేల 112 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న విధంగా పేద, బడుగు వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు పేరుతో నూతన గృహనిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. భద్రాద్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముని సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకం ద్వారా ప్రతీ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ళ చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇళ్ళ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

Read also: CM Revanth Reddy: గోల్కొండ కోటపై రెప రెప లాడిన జాతీయ జెండా.. జాతిని ఉద్దేశించి సీఎం ప్రసంగం..

ఈ పథకం కింద పేదలు ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. మా ప్రభుత్వ ఎజెండాలో వ్యవసాయరంగం అత్యంత ప్రాధాన్యతా అంశంగా ఉంది. అందుకే ఇటీవల బడ్జెట్ లో వ్యవసాయ, అనుబంధ రంగాలకి భారీ మొత్తంలో 72,659 కోట్ల రూపాయలు కేటాయించాం. ఆహార ధాన్యాలతో సహా వివిధ పంటల ఉత్పత్తుల దిగుబడులు పెంచడం ద్వారా రైతన్నల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తోంది. రైతులకు కావలిసిన ఎరువులు, విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఈ ఏడాది వానాకాలం పంటకు జూలై 24 నాటికి 11.85 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశాం. ఇప్పటికీ ఇంకా 10.65 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.
3rd Rythu Runa Mafi: నేడే మూడో విడత రుణమాఫీ.. వైరా సభలో చెక్కులు అందజేయనున్నసీఎం రేవంత్‌