NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

Slbc

Slbc

CM Revanth Reddy: శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు (మార్చ్ 24) సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగే సమీక్షకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ అధికారులు, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, ఎన్‌జీఆర్‌ఐ, సింగరేణితో పాటు పలు శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సరిగ్గా నెల క్రితం ప్రమాదం జరిగి.. 8 మంది చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి.. కేవలం, గురుప్రీత్‌సింగ్‌ (పంజాబ్‌) మృతదేహాన్ని మాత్రమే రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి.

Read Also: Hyderabad MMTS: హైదరాబాద్‌లో ఘోరం.. ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం

కాగా, ఇప్పటి వరకు మరో ఏడుగురి మృతదేహాలు మాత్రం లభ్యం కాలేదు. అయితే, నేటి సమీక్షలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు సీఎం రేవంత్ దిశానిర్దేశనం చేసే అవకాశం ఉంది. మరోవైపు సహాయక చర్యల కోసం రూ.5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతుండటంతో.. పాటు టన్నెల్ చివరి 50 మీటర్లను అత్యంత ప్రమాదకరమైన జోన్ గా ప్రకటించి కంచె ఏర్పాటు చేశారు. ఇక, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేమని సిబ్బంది తేల్చి చెప్పాయి. కాగా, టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ ఎపిసోడ్ పై ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.