CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్రంతో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల సంభవించిన భారీ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇవాళ అమిత్ షాను కలిసి సీఎం రేవంత్ రెడ్డి తెలుపనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణ..కొత్త మంత్రులను నేడు ఖరారు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి తెలియజేసింది. దాదాపు రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి తొలుత కేంద్రానికి నివేదించారు.
Read also: Employees Transfers: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. బదిలీల గడువు పొడిగించిన సర్కార్..
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. గ్రామీణ, మండల, జిల్లా స్థాయి రోడ్లు పెద్దఎత్తున పాడైపోతున్న పరిస్థితిని వివరిస్తారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరనున్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించి ఆర్థిక సాయం అందించాలని రేవంత్ కోరారు. ప్రధాని, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ ఖరారైతే.. వర్షాల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి వారికి అందచేయనున్నారు. ఇదే పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. వీలైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలను కలుస్తానన్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై పార్టీ నేతల ఆమోదం తీసుకోనున్నారు.
Mythri Movie Distributors : ఒకే వారం.. మూడు సినిమాలు