NTV Telugu Site icon

Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ..

Revanth Reddy

Revanth Reddy

Osmania Hospital: హైదరాబాద్ మహా నగరంలోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎంకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లతో పాటు సలహాదారు కే. కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శాంతకుమారి, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, తదితరులు హాజరయ్యారు.

Read Also: DSP Deepti Sharma: డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన టీమిండియా ప్లేయర్ దీప్తి శర్మ

ఇక, సుమారు రూ.2,700 కోట్ల వ్యయంతో 26.30 ఎకరాల్లో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. 32 లక్షల చదరపు అడుగుల భవనాలతో పాటు 2 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రిని నిర్మించనున్నారు. 500 బెడ్లతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్.. 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు.. అధునాతన వసతులతో 41 ఆపరేషన్ థియేటర్లు.. అలాగే, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కూడిన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల విభాగం కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు ఆస్పత్రికి అనుబంధంగా డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలను.. 750 సీట్ల కెపాసిటీతో భారీ ఆడిటోరియం నిర్మించనున్నారు. విద్యార్థులు, స్టాఫ్ కోసం రెసిడెన్షియల్, ప్లే జోన్లు.. పేషెంట్ అటెండర్లకు నిత్యన్నదానం కోసం ధర్మశాలను కూడా నిర్మించేలా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. 2 వేల కార్లు, వెయ్యి బైక్‌లకు సరిపడా అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఫెసిలిటీతో పాటు నలువైపులా విశాలమైన రోడ్లు, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

CM Revanth Reddy LIVE: ఉస్మానియా ఆస్పత్రికి శంకుస్థాపన LIVE | NTV