Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ..
- ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ..
- గోషామహల్ స్టేడియంలో ఆధునిక హంగులతో కొత్త ఆస్పత్రి నిర్మాణం..
- భూమిపూజలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం, దామోదర రాజనర్సింహ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Osmania Hospital: హైదరాబాద్ మహా నగరంలోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎంకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లతో పాటు సలహాదారు కే. కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శాంతకుమారి, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, తదితరులు హాజరయ్యారు.
Read Also: DSP Deepti Sharma: డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన టీమిండియా ప్లేయర్ దీప్తి శర్మ
Also Read
- CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
- Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
- El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ఇక, సుమారు రూ.2,700 కోట్ల వ్యయంతో 26.30 ఎకరాల్లో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. 32 లక్షల చదరపు అడుగుల భవనాలతో పాటు 2 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రిని నిర్మించనున్నారు. 500 బెడ్లతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్.. 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు.. అధునాతన వసతులతో 41 ఆపరేషన్ థియేటర్లు.. అలాగే, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కూడిన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల విభాగం కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు ఆస్పత్రికి అనుబంధంగా డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలను.. 750 సీట్ల కెపాసిటీతో భారీ ఆడిటోరియం నిర్మించనున్నారు. విద్యార్థులు, స్టాఫ్ కోసం రెసిడెన్షియల్, ప్లే జోన్లు.. పేషెంట్ అటెండర్లకు నిత్యన్నదానం కోసం ధర్మశాలను కూడా నిర్మించేలా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. 2 వేల కార్లు, వెయ్యి బైక్‌లకు సరిపడా అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఫెసిలిటీతో పాటు నలువైపులా విశాలమైన రోడ్లు, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!