CM Revanth Reddy: ఖైరతాబాద్‌లోని గణనాథుడు ట్యాంక్‌బండ్ వద్ద హుస్సార్ సాగర్‌లోని గంగమ్మ ఒడ్డుకు చేరుకోనుంది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన సచివాలయం నుంచి కాలినడకన ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. నిమజ్జన క్రేన్స్ వద్ద పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. క్రేన్ డ్రైవర్స్, ఇతర సిబ్బంది అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మూడు షిఫ్టుల్లో డ్రైవర్స్ ,ఇతర సిబ్బందికి విధులు కేటాయించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆశించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
నిమజ్జనం ప్రక్రియ ముగిసే వరకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎప్పటికపుడు పరిస్థితులను అంచనా వేస్తూ అలెర్ట్ గా ఉండాలని పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మరికాసేపట్లో ఖైరతాబాద్ గణసుడు ట్యాంక్ బండ్ క్రేన్ నంబర్ 4కు చేరుకోనుంది. బొజ్జగణపతి నిమజ్జనానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి బయల్దేరిన మహా గణపయ్య శోభాయాత్ర లక్డీకపూల్ మీదుగా సచివాలయం వైపు సాగుతోంది. వేలాది మంది భక్తుల నడుమ శోభాయాత్ర ముందుకు సాగుతోంది. దీంతో పోలీసులు కార్యదర్శి వైపు నుంచి ట్యాంక్ బండ్ వైపు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం వెంట పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.
Ganesh Immersion Live Updates: ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు.. లైవ్ అప్డేట్స్