CM Revanth Reddy: మహిళల కోసం భవిష్యత్తులో మరిన్ని ఆసుపత్రులు..
- పింక్ పవర్ రన్ విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి బహుమతులు..
- మేఘా కృష్ణా రెడ్డి- సుధా రెడ్డి కి ధన్యవాదాలు..
- స్త్రీల ఆరోగ్యం మెరుగ్గా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్-2024 కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.పింక్ పవర్ రన్ విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మేఘా కృష్ణా రెడ్డి, సుధా రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీల ఆరోగ్యం మెరుగ్గా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తుందన్నారు. స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరిన్ని హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నామని శుభవార్త చెప్పారు. గచ్చిబౌలి స్టేడియం సాక్షిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ లో భాగంగా మెయిల్ ఆధ్వర్యంలో సుధా రెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా మారతాన్ నిర్వహించారు. మారతాన్ అనంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను బ్రేక్ చేశారు. సీఎం రేవంత్ సమక్షంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశారు…
హైదరాబాద్ గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్-2024 కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి ప్రారంభించారు. 3K, 5K మరియు 10K పరుగులు ఏకకాలంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించేందుకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడం, క్యాన్సర్‌ను ముందుగా గుర్తించకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ముందుగా గుర్తిస్తే సరైన చికిత్సతో మహమ్మారిని తరిమికొట్టవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పింక్ పవర్ రన్ 2024 నిర్వహించారు.
Tamilnadu: భారీ వర్షాలు.. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!