NTV Telugu Site icon

CM Revanth Reddy: జానారెడ్డితో సీఎం రేవంత్ అంతరంగిక చర్చలు..

Revanth

Revanth

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఢిల్లీ పర్యటన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఊహాగానాలతో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. కొద్ది సేపు జానారెడ్డితో సీఎం అంతరంగిక చర్చలు జరిపినట్లు సమాచారం. అనంతరం లంచ్ ముగించుకుని సచివాలయానికి వెళ్లిపోయారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే, జానారెడ్డితో సీఎం భేటీ కావడంపై ఆసక్తి నెలకొంది.

Read Also: Hollywood : ‘బ్యాట్‌మ్యాన్‌’ సీక్వెల్ రిలీజ్ వాయిదా..కారణం ఏంటంటే.?

అయితే, కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ నెల 10 నుంచి బడ్జెట్ సమావేశాల నిర్వహించాలని సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీలో అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇక, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం సైతం ఉంది.