NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. కీలక అంశాలపై చర్చలు..

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ రోజు (మార్చ్ 7) ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కూడా వెళ్లబోతున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి వీరంతా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఈరోజ సాయంత్రం కలవనున్నారు. అలాగే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశం కానున్నారు.

Read Also: YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసులో సాక్షి మృతి.. కడప ఎస్పీ సంచలన వ్యాఖ్యలు

అయితే, తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. రెండు రోజులు సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌ గడువు ఈ నెల 10వ తేదీ వరకు ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు కేబినెట్ విస్తరణపై కూడా తెలంగాణ కాంగ్రెస్ బృందం ఏఐసీసీ పేదలతో చర్చించనున్నారు.