CM Chandrababu Naidu: ఆంధ్రపదేశ్, తెలంగాణ రెండూ నాకు రెండు కళ్లు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జూబ్లీహిల్స్ లోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసం నుండి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు భారీ ర్యాలీ తో బయలు దేరారు. ర్యాలీలో భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక చంద్రాబాబు ట్రస్ట్ భవన్‍కు తొలిసారి రావడంతో టీడీపీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన సభా వేదిక పైకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు. ట్రస్ట్ భవన్ కు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. వేదికపైకి వచ్చిన వెంటనే అభిమానులు కార్యకర్తలకు చంద్రబాబు అభివాదం చేశారు. అనంతరం సభా వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు నివాళుల ఆర్పించారు.
Read also: Chalasani Srinivas: గుజరాత్ పాలకుల కాళ్ళ కింద తెలుగు రాష్ట్రాలు ఉండాలా
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలని తెలిపారు. మహా నాయకుడు యుగపురుషుడు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టింది ఈ గడ్డ పైనే అని అన్నారు. తెలుగు జాతికి అన్యాయం జరిగిందని వారికి అండగా నిలబడడానికి తెలుగు దేశం పార్టీ పెట్టారని తెలిపారు. ఇక్కడికి వచ్చిన మీ అందరినీ చూస్తుంటే మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వికసిస్తుంది అనిపిస్తుందని తెలిపారు. నాకు ఆంధ్రపదేశ్ తెలంగాణ రెండూ రెండు కళ్లని హర్షం వ్యక్తం చేశారు. పటేల్ పట్వారీ విధానాన్ని రద్దు చేసి వారికి స్వాతంత్య్రం కల్పించింది తెలుగు దేశం పార్టీ తరుపున నందమూరి రామారావు అన్నారు. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ నుండి నాయకులు పోయారు.. కానీ కార్యకర్తలు వెళ్ళలేదని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతి ఉన్న వరకు తెలుగుదేశం పార్టీ ఉంటదని తెలిపారు.
Kalki2898AD Records: సౌత్ ఇండియా హీరోలలో ‘ఒకే ఒక్కడు’ ప్రభాస్!