Site icon NTV Telugu

Telangana Cabinet: 317 జీవో పై క్యాబినెట్ సబ్‌క‌మిటీ భేటీ.. హాజరైన ముగ్గురు మంత్రులు

Telangana Cabinet

Telangana Cabinet

Telangana Cabinet: సెక్రటేరియట్ లో భేటీ కానున్న 317 జీవో క్యాబినెట్ స‌బ్ క‌మిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోద‌ర రాజ‌న‌ర్సింహా, శ్రీ‌ధ‌ర్ బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్ హాజ‌రయ్యారు. 317 జీవో ప్ర‌భావిత ఉద్యోగుల అభ్య‌ర్థ‌న‌ల‌పై క‌మిటీ చ‌ర్చించ‌నున్నారు. ఇప్ప‌టికే స్పౌజ్‌, మెడికల్‌, మ్యూచువల్‌, కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల భార్య/భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. మిగ‌తా దరఖాస్తులపై శాఖ‌ల వారీగా నివేదిక‌లు సిద్ధం చేసింది. 16వ తేదీ నాటికే జీఏడీకి చేరిన నివేదిక‌లపై చ‌ర్చించనున్నారు.

Read also: Ponguleti Srinivasa Reddy: అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్ట్ కు గండి..

2008 డీఎస్సీ బాధితుల‌కు ఉద్యోగాలు ఇచ్చే అంశంలో విధివిధానాల‌పైనా స‌బ్ క‌మిటీ చ‌ర్చించే అవ‌కాశం ఉంది. బాధితుల‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ త‌ర‌హాలో ఉద్యోగాలు ఇవ్వాల‌ని మార్చి 14న‌ జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకుంది. విధివిధానాల ఖ‌రారు బాధ్య‌త‌ను క్యాబినెట్ స‌బ్ క‌మిటీకి ప్ర‌భుత్వం అప్ప‌గించింది. ఇప్ప‌టికే ఉమ్మ‌డి జిల్లాల వారీగా న‌ష్ట‌పోయిన అభ్య‌ర్థుల వివ‌రాలు విద్యాశాఖ‌ సేక‌రించింది. బాధితుల‌కు ఆరు వారాల్లోగా ఉద్యోగాలు ఇస్తామ‌ని జూన్ 27న హైకోర్టుకు ప్ర‌భుత్వం తెలిపింది. ఆగ‌స్టు 8 త‌దుప‌రి కోర్టు విచార‌ణ జ‌రుప‌నున్నారు. ఈ నేప‌థ్యంలో నేటి స‌మావేశంలో డీఎస్సీ 2008 బాధితుల‌కు ఉద్యోగాలు క‌ల్పించే అంశంపై విధివిధానాలు ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది.
December Clash: అన్ని వేళ్లు పుష్పా వైపే..అసలు కారణం ఏంటంటే..?

Exit mobile version