Ponnam Prabhakar: అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్ట్ కు గండి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిన్న మంత్రి తుమ్మల కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. ఎన్నికల ముందు చెప్పినట్టు రైతు రుణమాఫీ ని సుమారు 31 వేల కోట్ల రూపాయలు రైతులకు అండగా ఉంటూ రైతే రాజు అన్నట్టు 18 వ తేదీ నాడు గంటలో రుణ మాఫీ చేశామన్నారు. 6000 పైన అకౌంట్స్ కి రైతు రుణమాఫీ చేసామని తెలిపారు. లక్షల రూపాయల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేశామని అన్నారు. 41 మంది రైతు కూలీలు రక్షించే విషయంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడి హెలికాప్టర్ సహాయంతో కాపాడినందుకు.. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వనికి తెలంగాణ ప్రభుత్వం తరపున నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు. 1981 లో ఒకసారి ప్రాజెక్ట్ తెగింది. ప్రాజెక్ట్ మూడు గేట్లు ఉండి 40 వేల క్యూ సెక్యులు వరద విడుదల అవుతుంది. 70 వేల క్యూ సెక్యులు వచ్చింది.అధికారుల నిర్లక్ష్యంగా ఉండడమే ఇంతటి నష్టానికి కారణం అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో నే ప్రాజెక్ట్ కి గండి పడిందన్నారు.
Read also: TG Health Department: కురుస్తున్న భారీ వర్షాలు.. ఆరోగ్య శాఖ సూచనలు..
సరైన సమయానికి గేట్లు ఎత్తివుంటే ఇంతటి ప్రమాదం జరిగేది కాదన్నారు. పైనుండి వచ్చే వరద ని తెలుసుకోకుండా ఉండడమే అధికారుల నిర్లక్యం అన్నారు. అధికారులకు ఇప్పటికే షోకాజు నోటీస్ లు ఇచ్చాం. విచారణ తేలితే శిక్షార్హులు అవుతారన్నారు. నష్టం జరిగిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం అదుకుంటుందన్నారు. 400 ఎకరాలు ఇసుక మెట్లతో పూడికుపోయిందని తెలిపారు. ఈ 400 ఏకరాలకు 10 వేలు ఇసుక రీమోవ్ కి ప్రభుత్వం ఇస్తుందన్నారు. పత్తి వరి పోయిన వారికి విత్తనాలు ఉచితంగా ఇస్తున్నామన్నారు. కొట్టుకుపోయిన గొర్రిలకు కి 3000/- ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఆవులు, గేదెలుకు ఒక్కో శాల్తీకి 20 వేలు ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి తో మాట్లాడి తక్షణ మరమ్మతులు కు 8 కోట్లు రూపాయలు సెక్షన్ చేశామన్నారు. రాఘవ రెడ్డి ట్రస్ట్ ద్వారా పూరి ఇల్లు కి 10 వేలు. RCC బిల్డింగ్ 5000/- వ్యక్తిగతంగా ఆర్ధిక సహాయాన్ని స్థానిక ఎమ్మెల్యే ద్వారా తక్షణమే ఇస్తున్నా అన్నారు. వరద వల్ల నీట మునిగి నష్టపోయిన ఇళ్ళ వారికి ఇందిరమ్మ ఇళ్ళు ప్రత్యేకంగా సెక్షన్ చేస్తామన్నారు.
Gambhir-Jadeja: జడేజా అత్యంత కీలక ప్లేయర్.. అతడిని జట్టు నుంచి తప్పించలేదు: గంభీర్