NTV Telugu Site icon

KTR: తెలుగు తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ ను ఎవరో వచ్చి ఆహ్వానిస్తే ఎలా..

Ktr

Ktr

KTR: ఈనెల 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానిస్తారని సీఎం రేవంత్ రెడ్డి మాటలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్‌ను ఎవరో వచ్చి ఆహ్వానిస్తే ఎలా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆవిష్కరణ చేసేది.. తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు? అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి యా.. కాంగ్రెస్ తల్లి యా? తెలియదని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: Shaktiman : అటు ఇటు తిరిగి ఆఖరికి ‘శ‌క్తిమాన్’ ఎవ‌రు అవుతారో ?

తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన జరిగిన రోజు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియదన్నారు. ఇప్పుడు కొత్తగా విగ్రహం ఆవిష్కరణ చేస్తామని అంటున్నారని తెలిపారు. తెలంగాణ భవన్ లో అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే వేల విగ్రహాలు ప్రతిష్టించి ఉన్న తెలంగాణ తల్లి రూపుని మారుస్తాం అంటే ఎలా? అని మండిపడ్డారు.

Read also: Komatireddy Venkat Reddy: నాకు పేరు వస్తుందనే కేసీఆర్ నిధులు విడుదల చేయలేదు..

మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విగ్రహాలు మారుస్తాం- కేటీఆర్

మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తామన్నారు. సచివాలయం ముందు ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం కూడా మారుస్తామన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం కావాలి అని అంబేద్కర్ చెప్పారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ చెప్పిన స్వేచ్చను హరిస్తుందని మండిపడ్డారు. సచివాలయం పక్కన 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ పెట్టారని తెలిపారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి వేడుకలు అక్కడ చేయొచ్చని తెలిపారు. మా మీద ఉన్న కోపంతో అక్కడ ప్రోగ్రాంలు చేయట్లేదని తెలిపారు. మేము చేస్తామంటే పోలీసుల నిర్బంధంతో మమ్మల్ని అక్కడకు అనుమతించడం లేదని అన్నారు.

Read also: Modi-Kharge: ఈ సీన్ అదుర్స్.. మోడీకి షేక్‌ హ్యాండ్ ఇచ్చిన ఖర్గే.. నవ్వుతూ ముచ్చట్లు (వీడియో)

125 అడుగుల అంబెడ్కర్ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక రేవంత్ రెడ్డి ఉద్దేశ్యం ఏంటి? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన స్పూర్తితో మేము దళిత బంధు తీసుకువచ్చామని గుర్తుచేశారు. కానీ మీరు దళిత బంధు ఎవరికీ ఇవ్వట్లేదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ పేరు మీద కేసీఆర్ తీసుకువచ్చిన విదేశీ విద్యానిధిని పట్టించు కోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము విగ్రహం దగ్గరకు వెళ్లి శుభ్రం చేయాలి అనుకున్నామని అన్నారు. కానీ మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు.

Read also: Uttam Kumar Reddy: రేపు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ను సీఎం ప్రారంభిస్తారు..

మా ఎమ్మెల్యేల ఇంటి ముందు , తెలంగాణ భవన్ ముందు వందల సంఖ్యలో పోలీసులను పెట్టారని కేటీఆర్ అన్నారు. మా మీద ఎన్ని కేస్ లు పెట్టినా మేము అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వానికి మా గళం వినిపిస్తామన్నారు. అసెంబ్లీని నెల రోజులు నడపాలని కోరారు. రాష్ట్ర ప్రజల తరుపున అసెంబ్లీలో కొట్లాడతామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి గౌరవిస్తే మేము గౌరవం ఇస్తామని, మీరు తిడితే.. మేము తిట్లు తిడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ఒకవేళ కేసీఆర్ ను గౌరవిస్తే మేము కూడా గౌరవం ఇస్తామన్నారు. మీరు ఒకటి తిడితే.. మేము పది తిట్లు తిడతామని అన్నారు.
Bangladesh: భారత్‌లోని ఇద్దరు దౌత్యవేత్తలను వెనక్కి పిలిచిన బంగ్లాదేశ్

Show comments